టీజీబీ సేవల్లో నాలుగు రోజులపాటు అంతరాయం

టీజీబీ సేవల్లో నాలుగు రోజులపాటు అంతరాయం

హనుమకొండ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ)లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) లో విలీనం చేస్తున్నారు. ఈ  నేపథ్యంలో నాలుగు రోజుల పాటు సేవల్లో అంతరాయం ఉండనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌‌‌‌ కే ప్రతాప్‌‌‌‌ రెడ్డి తెలిపారు. 

శుక్రవారం ఆయన హనుమకొండలో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. ఏపీజీవీబీ బ్యాంక్‍ విలీనం కారణంగా ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంకింగ్‍లో  నగదు లావాదేవీలు, యూపీఐ, మొబైల్‍ బ్యాంకింగ్‍, ఇంటర్నెట్‍ బ్యాంకింగ్‍, ఏటీఎంల సేవల్లో అంతరాయం ఉంటుందన్నారు. 30,31 తేదీల్లో మాత్రం అత్యవసర అవసరాల కోసం రూ.10వేల నగదు వరకు అందిస్తామన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు ఉంటే బ్యాంక్‍ మేనేజర్‍లను కలవాలని సూచించారు.కార్యక్రమంలో జనరల్‍ మేనేజర్లు దయాకర్‍, విద్యాధర్‍, మేనేజర్‍ శశికాంత్‍ పాల్గొన్నారు.