ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనాను కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపడుతోంది. అయితే.. గడచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా... 4,348 పాజిటివ్ కేసులు నిర్ధారణర అయ్యాయి. ఇద్దరు చనిపోయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 823 కేసులు గుర్తించారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 86 కేసులు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో 100కి పైనే పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 13/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 13, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,89,332 పాజిటివ్ కేసు లకు గాను
*20,60,621 మంది డిశ్చార్జ్ కాగా
*14,507 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,204#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/zy1vcrt1EE
మరిన్ని వార్తల కోసం..