
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం డిచిన 24 గంటల్లో 8,012 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తాజా లెక్కలతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,829కి చేరిందని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 88 మంది కరోనాతో మరణించారు. చిత్తూరులో 10 మంది, తూర్పుగోదావరిలో 10 మంది, కర్నూలులో 9, నెల్లూరులో 9, అనంతపూర్‌లో 8, పశ్చిమ గోదావరిలో 8, విశాఖపట్టణంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కడపలో ఆరుగురు, ప్రకాశంలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మరణించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 2,650కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 85,945 యాక్టివ్ కేసులున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 2,01,234 మంది కోలుకున్నారు. వ్యాధి నుంచి కోలుకొని ఈ ఒక్కరోజే 10,117 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.