వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతల బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు..

వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. అసలే కీలక నేతల వరుస రాజీనామాలు ఒకవైపు.. కేసులు మరోవైపు వెరసి అయోమయంలో పడ్డ వైసీపీ క్యాడర్ కు మరో షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.టీడీపీ ఆఫీస్‌పై దాడికేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు.

ఈ కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి తలశిల రఘురాంలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్  పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.

Also Read :- మిఠాయి వాలా, నీలోఫర్ కేఫ్‌ల్లో రైడ్స్

దీంతో పాటు సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా తిరస్కరించింది ధర్మాసనం.ఈ క్రమంలో మరికొంత మంది కీలక వైసీపీ నేతల అరెస్టుకు రంగం సిద్దమైనట్లే అని చెప్పాలి.