ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వడ్డిబోయిన సుజాత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో జస్టిస్ సుజాత తలకు గాయాలయ్యాయి. వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.