కాల్ ఆఫ్ డ్యూటీ: నెల బిడ్డతో విధులకు హాజరైన IAS ఆఫీసర్

కాల్ ఆఫ్ డ్యూటీ: నెల బిడ్డతో విధులకు హాజరైన IAS ఆఫీసర్

ఆంధ్రప్రదేశ్‌: నెల బిడ్డతో విధులకు హాజరయ్యారు ఓ మహిళా IAS ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన IAS ఆఫీసర్ శ్రీజన గుమ్మల గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో ( GVMC) కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే శ్రీజన ఆరు నెలల మెటర్నిటీ లీవ్ పై  వెళ్లగా…. నెల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చారు.  తాను తీసుకున్న సెలవులు మిగిలివున్నప్పటికీ ఆరోగ్యపరంగా రెస్ట్ అవసరమయినప్పటికీ డ్యూటీకీ హజరయ్యారు శ్రీజన.  ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో తన సేవలు ప్రజలకు, ప్రభుత్వానికి అవసరమని తాను భావించానని ఆమె అన్నారు. అందుకే   విధులకు హాజరయ్యానని.. ఇది తనకు ‘కాల్ ఆప్ డ్యూటీ’ అని చెప్పారు.  వీరిని సోషల్ మీడియాలో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బాధ్యతగల ఆఫీసర్లు ఉండటంవలన కరోనాపై దేశం సమర్ధవంతంగా ఫైట్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీజన నిబద్ధతను  కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. ఇలాంటి ఆఫీసర్లు ఉండటం దేశ అదృష్టమని అన్నారు. శ్రీజనకు   హృదయపూర్వక కృతజ్ఞతలు  తెలిపుతూ ఆయన ట్వీట్ చేశారు.  సోమవారం పొద్దున వరకు ఆంధ్ర ప్రదేశ్‌లో 427  కరోనా కేసులు నమోదవగా… ఏడుగురు మృతిచెందారు. దేశంమొత్తంలో కోవిడ్ కేసులు 9152కు చేరాయని 308మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.