
ప్రజా రవాణాపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం నుంచి ఆదేశాలు వచ్చాన 24 గంటల్లోనే … కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. యాంటీ వైరల్ స్ప్రే లను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. భౌతిక దూరం పాటించేలా బస్సు సీటింగ్ లో మార్పులు చేయడంతో పాటు పల్లె వెలుగు బస్సుల్లో మార్కింగ్ సిస్టమ్ ను అమలు చేస్తున్నామన్నారు మంత్రి పేర్ని.
అంతేకాదు ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించలేదని స్పష్టం చేశారు మంత్రి పేర్నినాని. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనా ఇన్సూరెన్స్ లేనందునే కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచామన్నారు. ఉద్యోగుల్ని ఎక్కడా తొలగించలేదని, తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.