
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి ప్యారిస్ (ఫ్రాన్స్ రాజధాని)లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కింది. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి.. ప్యారిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకోబోతోంది. దీంతో కుమార్తెను పారిస్ పంపేందుకు మంగళవారం సీఎం జగన్ బెంగుళూరుకు వెళ్లబోతున్నట్లు సమాచారం. బెంగళూరు నుంచి విమానంలో కుమార్తెను ప్యారిస్ పంపించనున్నారు జగన్.