
- మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో బుక్ ఆవిష్కరించిన పవన్ కల్యాణ్
మంగళగిరి: మారిశెట్టి మురళీ కుమార్ రాసిన ‘‘ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, శాసనసభలో ఎవరెవరు?”అనే పుస్తకాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకానికి పవన్ కల్యాణ్ ముందుమాట రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ, లోక్ సభ స్థానాల నుంచి 1952 –2019 వరకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫొటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచిందనే వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా రచయిత మురళీ కుమార్‌ను పవన్ కల్యాణ్ అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికి, ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.