
అమరావతి: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఆ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మెగా డీఎస్సీ షెడ్యూల్ను మంత్రి లోకేశ్ శనివారం ‘ఎక్స్’ లో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, జీఓలు, పరీక్ష షెడ్యూల్ వివరాలను పాఠశాల విద్యా శాఖ వెబ్ సైటలో ఆదివారం ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచామని డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు.