
రాష్ట్రంలో 10,820మందికి కరోనా సోకినట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. గడిచిన 24గంటల్లో మొత్తం 62,912మందికి కరోనా టెస్ట్ లు చేయాగా అందులో 10,820మందికి పాజిటీవ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఇప్పటిదాకా చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 24.87లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో మొత్తం కేసులు 2.27లక్షలు కాగా, అందులో 13.87లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 87,112గా ఉంది.
ఇక ఆయా జిల్లాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి ఈస్ట్ గోదావరి , వెస్ట్ గోదావరి లో ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఈస్ట్ గోదావరిలో 1543 కేసులు నమోదు కాగా అందులో 6మరణాలు నమోదయ్యాయి.ఈస్ట్ గోదావరిలో 1543 కేసులు నమోదు కాగా అందులో 6మరణాలు , వెస్ట్ గోదావరిలో 1132 కొత్త కేసులు నమోదు కాగా 10 మరణాలు చోటుచేసుకున్నాయి. మిగిలిన జిల్లాలైన అనంతపురం (858 కొత్త కేసులు, 8 మరణాలు), చిత్తూరు(848- 10), కర్నూలు (1399 – 7),కడప (823 – 8), నెల్లూరు (696 -4),ప్రకాశం (430 – 11), గుంటూరు (881 – 12), కృష్ణా(439 – 4), శ్రీకాకుళం(452 – 8), విశాఖపట్నం(961 – 6), విజయనగరం జిల్లాలో కొత్తగా 358 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి.