
ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే గంటల వ్యవదిలో అరెస్ట్ చేస్తామని అన్నారు అమరావతి పోలీసులు. తాము ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. 144సెక్షన్, 30పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పినా జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసరికి కట్టడి చేయక తప్పలేదని అన్నారు. అయితే కొందరు పోలీసులు దాడి చేశారని తప్పుడు వీడియోలు విడుదల చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని విడిచిపెట్టే ప్రసక్తిలేదని అన్నారు. తుళ్లూరు లో ట్రాన్స్ ఫార్మర్ పట్టుకుని రైతు ఆత్మహత్య ఘటన అవాస్తవమని అన్నారు. మహిళలపై లాఠీచార్జ్ చేశామన్నది అబద్దమని.. మహిళలను మహిళా కానిస్టేబుల్సే అడ్డుకున్నరని చెప్పారు. తమ అదుపులో ఉన్న వారెవరూ చనిపోలేదని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుంగా చర్యలు చేపట్టడం తమ బాధ్యతఅని అన్నారు.