అమరావతి: ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 13,891 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. వైరస్ బారిన పడి 12 మంది కన్నుమూశారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చనిపోయారు. గత 24 గంటల్లో 5716 మంది కరోనా నుంచి కోలుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
విశాఖపట్నంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అక్కడ 1988 మంది వైరస్ బారినపడ్డారు. ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరులో 1422, అనంతపురంలో 1345, నెల్లూరులో 1305 మందికి కొవిడ్ నిర్థారణ అయింది.
ఇవి కూడా చదవండి..
కోలుకున్న స్టాక్ మార్కెట్లు
పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్గా వీడియో