ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 40,728 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 381 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,68,064కి చేరింది.గత 24 గంటల్లో నలుగురు కరోనా మరణించారు. కరోనాతో అనంతపురం, చిత్తూరు, కృష్ణా,విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6992కి చేరుకొంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,57,854 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో934 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.