
ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,621 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. 8,528 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో 13 మంది, నెల్లూరు 11, తూర్పుగోదావరి 10, చిత్తూరు 9, కడప 7, పశ్చిమగోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 6, విశాఖపట్నం 6, గుంటూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లాలో నలుగురు మరణించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో815, చిత్తూరులో928, తూర్పుగోదావరిలో1089, గుంటూరులో 926, కడపలో 844, కృష్ణాలో316, కర్నూల్ లో855, నెల్లూరులో 934, ప్రకాశంలో 1020, శ్రీకాకుళంలో 846, విశాఖపట్టణంలో593, విజయనగరంలో 563, పశ్చిమగోదావరిలో892 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,92,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 3,633 మంది మరణించారు. ప్రస్తుతం 94,209 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది