
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ 6100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరుతోంది.
కానిస్టేబుల్: మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు (3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ) ఏదైనా ఇంటర్మీడియల్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు కనీసం 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/ లాంగ్‌జంప్ ఈవెంట్లు ఉంటాయి. డిసెంబర్ 28 వరకు ఆన్లైన్లో రూ.300. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.150 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ప్రిలిమ్స్ జనవరి 22న నిర్వహించనున్నారు.
ఎస్సై ఉద్యోగాలు: మొత్తం 411 ఎస్ఐ పోస్టులకు (315 సివిల్, 96 రిజర్వ్) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు కనీసం 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.600. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 19న నిర్వహించనున్నారు. వివరాలకు www.slprb.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.