ఏపీపై జీబీఎస్ వ్యాధి అటాక్.. గుంటూరులో మహిళ మృతి.. ఆ 16 మంది పరిస్థితి ఏంటో..?

ఏపీపై జీబీఎస్ వ్యాధి అటాక్.. గుంటూరులో మహిళ మృతి.. ఆ 16 మంది పరిస్థితి ఏంటో..?

అమరావతి: ఏపీలో జీబీఎస్ వ్యాధి దాడి మొదలైంది. ఆంధ్రాలో 17 మంది జీబీఎస్ లక్షణాలతో బాధపడుతుండగా తొలి GBS(గిలైన్ బారీ సిండ్రోమ్) మరణం ఆదివారం నమోదైంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కమలమ్మ అనే మహిళ ఈ న్యూరోలాజికల్ డిజార్డర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. 

కమలమ్మకు రెండ్రోజుల క్రితం తీవ్రమైన జ్వరం వచ్చింది. కాళ్లు రెండూ చచ్చిబడిపోయాయి. దీంతో.. ఆమెను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. GBS లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు చేసి అందుకు తగిన చికిత్సను అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ ఆదివారం గులియన్ బారే సిండ్రోమ్తో బాధపడుతూ చనిపోయింది. ఇలా.. ఏపీలో తొలి జీబీఎస్ మరణం నమోదు కావడం గమనార్హం. కమలమ్మ మాత్రమే కాదు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరికొందరు బాధితులు కూడా ఈ తరహా లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 

అసలు జీబీఎస్ అంటే ఏంటి..?
మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టం) పొరపాటుగా నాడీ వ్యవస్థపై దాడి చేయడం వల్ల వచ్చే అరుదైన వ్యాధే గిలైన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్). సాధారణంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు జీబీఎస్ కు దారి తీస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. కానీ దీనికి కచ్చితమైన కారణం ఏమిటో తెలియదు. మహారాష్ట్రలో కలుషిత నీరు లేదా ఆహారం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుండవచ్చని భావిస్తున్నారు. కాగా, ఈ వ్యాధి వచ్చినవారిలో కండరాలు, అవయవాలు బలహీనమై, పక్షవాతానికి దారితీయొచ్చు.