మమ్మల్ని ఆంధ్రాకు పంపండి

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఆర్టీసీ కార్మికులను సొంత రాష్ట్రానికి పంపాలని ఆ ప్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును శనివారం ఉద్యోగులు వెంకట్రావు, బాబురావు, శ్రీమన్నారాయణ, మందార రామకృష్ణ కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బదిలీలకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, తమ సమస్యను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.