ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

ఢిల్లీలో బీజేపీ భారీ విజయంతో ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 20) సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రాల అధ్యకులు, నాయకులు హాజరయ్యారు.  

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో ఇవాళ ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. 

ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. 

ALSO READ | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎంత..? ఆమె భర్త ఏం చేస్తుంటారు.. ఎంతమంది పిల్లలు..?