బంగాళాఖాతంలో వాయుగుండం.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక...

బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా  ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖవాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని  హెచ్చరిస్తున్నారు.  అలాగే లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు చేశారు.  

ALSO READ | హైదరాబాద్ సిటీకి రెడ్ అలర్ట్ : రేపటి నుంచి (30వ తేదీ) అతి భారీ వర్షాలు

ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాగా, ఈ వాయుగుండం ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సముద్రతీర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.