Modi 3.0: కేంద్ర క్యాబినెట్ లోకి టీడీపీ ఎంపీలు..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘానా విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. మోడీతో పాటుగా 30మంది ఎన్డీయే కూటమి ఎంపీలు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ 30మందిలో ఇద్దరు ఏపీ ఎంపీలకు కూడా అవకాశం దక్కనుందని సమాచారం అందుతోంది.టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలుపొందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కనుందని తెలుస్తోంది.

రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి, పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ శాఖ మంత్రిగా చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ ద్వారా ఈ ఇద్దరికీ అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీనే రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న నేపథ్యంలో కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పచ్చు.

సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో నేతగా మోదీ నిలిచారు.