
జోగిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయని ఆందోల్ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని డాకూర్, కోడెకల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్చెల్లని రూపాయని, పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం నీళ్లు , నిధులు, నియామకాలపై ఎక్కడా తగ్గకుండా పనిచేసిందన్నారు. డబుల్ బెడ్ రూంలు రాని వారికి త్వరలో అందజేస్తామన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్ పర్సన్మంజూశ్రీ, డీసీసీబీ డైరెక్టర్ జైపాల్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.