DC vs KKR: చివరి ఓవర్లో హై డ్రామా: 106 మీటర్ల సిక్సర్.. 3 బంతులకు 3 వికెట్లు.. స్టన్నింగ్ క్యాచ్

DC vs KKR: చివరి ఓవర్లో హై డ్రామా: 106 మీటర్ల సిక్సర్.. 3 బంతులకు 3 వికెట్లు.. స్టన్నింగ్ క్యాచ్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ లో తనదైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. పవర్ ప్లే లో కాస్త భారీగా పరుగులిచ్చినా డెత్ ఓవర్లో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం (ఏప్రిల్ 29) కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇన్నింగ్స్ 20 ఓవర్ అద్భుతంగా వేశాడు. తొలి బంతికి సిక్సర్ సమర్పించుకున్న ఈ పేసర్.. చివరి 5 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

19 ఓవర్ మూడో బంతికి స్టన్నింగ్ యార్కర్ తో పావెల్ ను ఔట్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత బంతికే అనుకుల్ రాయ్ ని పెవిలియన్ కు పంపాడు. ఐదో బంతిని హర్షిత్ రాణా బ్యాట్ మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతిలో పడింది. స్ట్రైక్ కోసం రస్సెల్ పరుగు తీసే క్రమంలో వికెట్ కోల్పోయాడు. దీంతో కేకేఆర్ మూడు బంతులకు మూడు వికెట్లను కోల్పోయింది. స్టార్క్ హ్యాట్రిక్ మిస్ అయినా.. జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఇదే ఓవర్ మొదటి బంతికి రస్సెల్ 106 మీటర్ల సిక్సర్ కొట్టగా.. నాలుగో ఓవర్లో చమీర స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో ఢిల్లీ, కేకేఆర్ నువ్వా నేనా అన్నట్టు ఆడుతున్నాయి. 205 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 10 ఓవర్లలో 3 వికృతిలా నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్ డుప్లెసిస్ (49), కెప్టెన్ అక్షర్ పటేల్ (17) ఉన్నారు. ఢిల్లీ గెలవాలంటే చివరి 10 ఓవర్లలో 108 పరుగులు చేయాలి. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన  కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 44 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్,స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. చమీరాకు ఒక వికెట్ దక్కింది