అంతర్జాతీయ క్రికెట్ లో ఒకసారి జట్టులో స్థానం కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా కంబ్యాక్ లో బాగా ఆడటం అంతకు మించి కష్టమనే చెప్పాలి. అయితే ఈ లెక్క విండీసీ స్టార్ ఆల్ రౌండర్ రస్సెల్ కు మాత్రం కాదు. రెండేళ్ల తర్వాత జట్టులో స్థానం సంపాదించిన ఈ స్టార్ క్రికెటర్ తొలి మ్యాచ్ లోనే అంచనాలకు మించి రాణించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
బార్బడోస్ వేదికగా నిన్న (డిసెంబర్ 12) ఇంగ్లాండ్, వెస్టిండీసీ మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లో రస్సెల్ అదరగొట్టాడు. మొదట బౌలింగ్ లో 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన ఈ స్టార్ ఆల్ రౌండర్ ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ ప్రణాళికలో భాగంగా రస్సెల్ ను ఎంపిక చేయగా.. తనను సెలక్ట్ చేయడం కరెక్ట్ అని ప్రూవ్ చేసాడు.
Welcome back, Andre Russell ? pic.twitter.com/YqiTjJA4rZ
— CricTracker (@Cricketracker) December 13, 2023
రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టీ20 ల సిరీస్ కోసం ఎంపిక చేశారు. చివరి సారిగా 2021 వరల్డ్ కప్ లో విండీస్ తరపున ఆడిన ఈ ఆల్ రౌండర్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. 2024 టీ 20 ప్రపంచ కప్ కోసం రస్సెల్ అవసరం ఉందని భావించిన విండీస్ బోర్డు జట్టులో స్థానం కలిపించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (40), బట్లర్ (39) తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించినా మిగిలిన వారెవరూ రాణించలేదు. లివింగ్ స్టోన్ 27 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేశారు. పావెల్ 15 బంతుల్లో 31 పరుగులు చేయగా.. రసెల్ 14 బంతుల్లో 29 పరుగులు బాదాడు. బ్రాండన్ కింగ్ (22), కైలీ మేయర్స్ (35) మంచి ఆరంభం ఇచ్చారు.
Andre Russell Innings vs England :
— Swapnil Vats (@iamswapnilvats) December 13, 2023
0, 2, 1, 1, 1, 2, 6, 1, 0, 6, 0, 4, 1,4
29*(14)#AndreRussell #WIvENG #KKRpic.twitter.com/7kwuwSY54r