"సైంధవ్" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. ఆయన హీరోగా వస్తున్న ఈ మూవీని.. హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీలో ఓ కీ రోల్ కోసం తమిళ బ్యూటీ ఆండ్రియా తీసుకున్నారు. ఆమె క్యారెక్టర్ కి సంబదించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఆమె ఈ సినిమాలో జాస్మిన్ అనే పాత్రలో కనిపించనుంది. వెంకటేష్ స్వయంగా ఆమె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం విశేషం. అయితే.. ఆండ్రియా ఇంతకుముందు నాగ చైతన్య హీరోగా వచ్చిన తడాఖా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది కానీ ఆండ్రియాకి మాత్రం సరైన అవకాశాలు రాలేదు.
ఇప్పుడు మరోసారి సైంధవ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ సినిమా ఐన మంచి విజయం సాధించి ఆండ్రియాకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుందో చూడాలి.