నాగ చైతన్య, సునీల్ హీరోలుగా వచ్చిన మూవీ తడాఖా. ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా, ఆండ్రియా నటించారు. ఆండ్రియాకు టాలీవుడ్ లో ఇది ఫస్ట్ మూవీ. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ ఇక్కడ బాగానే పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. రీసెంట్ గా విడుదలైన 'సైంధవ్'లోనూ ఆండ్రియా యాక్ట్ చేసింది. ఈ మూవీలో తన అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది.
తాజాగా ఈ అమ్మడిని పెళ్లి గురించి అడగ్గా..చేసుకోనని తెగేసి చెప్పేసింది. సింగిల్ గానే ఉంటానని కుండబద్దలు కొట్టింది. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా చెబుతొంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ.. ఎందుకో కుదర్లేదని వెల్లడించింది.
ALSO READ :- వాట్సాప్ లో డిలీటైన చాట్ పొందండి ఇలా..
ఇప్పుడు తన వయుసు 40 ఏళ్లని..ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని పేర్కొంది. పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని ఆండ్రియా చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న కూడా వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది.