పిక్సెల్​ స్మార్ట్​ఫోన్లతో ఆండ్రాయిడ్ 10

పిక్సెల్​ స్మార్ట్​ఫోన్లతో ఆండ్రాయిడ్ 10

ఆండ్రాయిడ్​ లేటెస్ట్​ వెర్షన్​ ‘ఆండ్రాయిడ్​ 10’ మరో వారంలో విడుదల కానుంది. వచ్చే నెల 3న క్యాలిఫోర్నియాలో విడుదల కానున్న ‘పిక్సెల్​4’ స్మార్ట్​ఫోన్లు ‘ఆండ్రాయిడ్​ 10’తోనే రూపొందాయి. అయితే ఇవి మార్కెట్లోకి రావడానికి మరో నెల పడుతుంది. అంటే అక్టోబర్​లో ‘ఆండ్రాయిడ్​ 10 ఓఎస్’తో రూపొందిన ఫోన్లు మార్కెట్లోకొస్తాయి. ముందుగా పిక్సెల్​ ఫోన్లు అప్​డేట్​ అయితే, ఆ తర్వాత మిగతా ఫోన్లు కూడా అప్​డేట్​ అవ్వొచ్చు. ఆ తర్వాత రూపొందే అన్ని ఆండ్రాయిడ్​ ఫోన్లు ‘ఆండ్రాయిడ్​ 10’ వెర్షన్​తోనే ఉంటాయి. కొత్త వెర్షన్​ విశేషాలివి.

ఇప్పటి వరకు ఆండ్రాయిడ్​ ఓఎస్​కు సంబంధించి పేర్లు పెట్టే సంప్రదాయాన్ని విడిచిపెట్టింది గూగుల్. గతంలో ‘ఓఎస్’కు డిసర్ట్స్​ పేర్లను  ఆల్ఫాబెటికల్​ ఆర్డర్​ ప్రకారం పెడుతూ వచ్చేది. ఇప్పుడు మాత్రం స్వీట్స్, డిసర్ట్స్​ పేర్లు కాకుండా నేరుగా ‘ఆండ్రాయిడ్​ 10’ అనే పేరు పెట్టింది.  ‘లాలిపాప్, నోగట్’ వంటి పేర్లు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థం కావడం లేదనే ఉద్దేశంతో ఏ కన్​ఫ్యూజన్​ లేకుండా పేర్లు పెట్టాలని గూగుల్​ నిర్ణయించింది. దీని ప్రకారమే ‘ఆండ్రాయిడ్​ 10’ పేరు పెట్టింది. ఇకపై వచ్చే వెర్షన్ల పేర్లు కూడా నెంబరింగ్​ ఆధారంగానే ఉంటాయి.  ఈ వెర్షన్​లో ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఒక యాప్​లో లొకేషన్​ యాక్సెస్ పర్మిషన్​ ఇస్తే అది ఎప్పుడూ లొకేషన్​ రీడ్ చేస్తూనే ఉంటుంది. కానీ, కొత్త వెర్షన్​లో యాప్​ యూజ్​ చేసినప్పుడు మాత్రమే మీ లొకేషన్​ యాక్సెస్​ చేస్తుంది.

ఏదైనా ఒక ఫైల్​ చేయాలంటే షేర్​ ఆప్షన్​ క్లిక్​ చేసి, షేర్​ షీట్​లోడ్​ అయ్యాక షేర్​ చేయాలి. అయితే డైరెక్ట్​గా షేర్​ షీట్​లోడ్​ అయ్యేలా కొత్త టూల్​ను  రూపొందించారు.  ‘ఆండ్రాయిడ్​ 10’ డార్క్​థీమ్​తో రానుంది. మొబైల్​ డార్క్​ మోడ్​లో ఉండటం వల్ల బ్యాటరీ సేవ్​ అవ్వడంతోపాటు, కళ్లపై ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంటుంది.

‘లైవ్​క్యాప్షన్’​ అనే మరో కొత్త ఫీచర్​ యాడ్​ కానుంది. ఇది బధిరులకు ఉపయోగపడుతుంది. ఏదైనా వీడియో ప్లే అవుతుంటే దానికి సంబంధించిన సబ్​టైటిల్స్​ఆటోమేటిగ్గా ప్లే అవుతుంటాయి. దీనికి డాటా కనెక్షన్​ కూడా అవసరం లేదు.  పేరెంటింగ్​ కంట్రోల్​ టూల్​‘గూగుల్​ వెల్​బీయింగ్’ను మరింతగా డెవలప్​ చేశారు. డివైజ్​లో పిల్లలు ఏదైనా యాప్​ ఇన్​స్టాల్​ చేయాలంటే పేరెంట్స్​ అప్రూవ్​ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్​టైమ్​ లిమిట్స్, యాప్​ లిమిట్స్​ వంటివి యాడ్​ చేశారు.  ఆండ్రాయిడ్​ ఫోన్లలో కనిపించే బ్యాక్​ బటన్​ను ఇక కనిపించదు. నావిగేషన్​ బేస్డ్​ స్వైపింగ్​ ద్వారా బ్యాక్​ రావొచ్చు. ఎడమ నుంచి కుడివైపు ఒకసారి స్వైప్​ చేస్తే సైడ్​ మెనూ ఓపెన్​ అవుతుంది. అదే డబుల్​ స్వైప్​ చేస్తే బ్యాక్​ వెళ్తుంది.