ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్‌‌‌‌ 10 అప్‌‌‌‌డేట్‌‌‌‌

ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్‌‌‌‌ 10 అప్‌‌‌‌డేట్‌‌‌‌

ఆండ్రాయిడ్‌‌‌‌ లేటెస్ట్‌‌‌‌ వెర్షన్‌‌‌‌ ‘ఆండ్రాయిడ్‌‌‌‌ 10’ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిజర్ట్‌‌‌‌ పేర్లకు భిన్నంగా ఈసారి వెర్షన్‌‌‌‌ నెంబరింగ్‌‌‌‌తోనే ‘ఆండ్రాయిడ్‌‌‌‌ 10’ విడుదలైంది. అయితే ఇది కొత్తగా విడుదలవుతున్న కొన్ని మోడల్స్‌‌‌‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో మిగతా ఫోన్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని యూజర్లు ఎదురుచూస్తున్నారు. గూగుల్‌‌‌‌ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికల్లా స్మార్ట్‌‌‌‌ఫోన్లకు ‘ఆండ్రాయిడ్‌‌‌‌ 10’ వెర్షన్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ అందుబాటులోకి వస్తుందని చెప్పింది.

‘ఎల్‌‌‌‌జి, మోటరోలా, ఏసస్‌‌‌‌, ఒప్పో, రియల్‌‌‌‌మి, సామ్‌‌‌‌సంగ్‌‌‌‌, షార్ప్‌‌‌‌, సోని, ట్రాన్సాన్‌‌‌‌, వివో’ వంటి బ్రాండ్లకు వచ్చే డిసెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు కొత్త అప్‌‌‌‌డేట్‌‌‌‌ ఉంటుందని చెప్పింది. అయితే ఏ మోడల్‌‌‌‌ ఫోన్లు అప్‌‌‌‌డేట్‌‌‌‌ అవుతాయనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ‘వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ 7టి, నోకియా 8.1’ మోడల్స్‌‌‌‌ ఇప్పటికే అప్‌‌‌‌డేట్‌‌‌‌ అయ్యాయి. రెడ్‌‌‌‌మి కె 20 ప్రొ మోడల్‌‌‌‌కు చైనాలో అప్‌‌‌‌డేట్‌‌‌‌ అయినా, మనదేశంలో ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.