తక్కువ ధరకే స్మార్ట్​హోమ్ గాడ్జెట్స్ ​..ఫీచర్స్ ఇవే..

తక్కువ ధరకే స్మార్ట్​హోమ్ గాడ్జెట్స్ ​..ఫీచర్స్ ఇవే..

మార్కెట్లోకి కొత్త గాడ్జెట్​, స్మార్ట్​ఫోన్​... ఏది  రాబోతున్నా సరే అందులో కొత్త అప్​డేట్స్, ఫీచర్లు ఏమేం ఉన్నాయని ఆరా తీస్తుంటారు చాలామంది. అలాంటి వాళ్లకు ఇప్పుడొచ్చిన కొత్త గాడ్జెట్స్​ ఇంట్రస్టింగ్​గా అనిపించొచ్చు. ఆండ్రాయిడ్​ 13,  రియల్​మి కంపెనీ స్మార్ట్​హోమ్​ గాడ్జెట్లు, వాట్సాప్​లో వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​, బ్యాక్​డ్రాప్​ వాయిస్​ మెసేజ్​ ఫీచర్లు అలాంటివే...తక్కువ ధరకే అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్​ఫోన్లు, టీవీలను అందిస్తున్న రియల్​మి కంపెనీ ఈ ఏడాది స్మార్ట్​హోమ్​ గాడ్జెట్లని తీసుకొస్తోంది. స్మార్ట్​ డోర్​బెల్​ నుంచి ఎయిర్​ప్యూరిఫయర్​ వరకు అన్నీ స్మార్ట్​ ఫీచర్లు ఉన్న గాడ్జెట్లని రిలీజ్​ చేయబోతోంది ఈ సంస్థ. 

స్మార్ట్​ డోర్​బెల్​ కెమెరా

ఈ గాడ్జెట్​లో మైక్రోఫోన్​తో పాటు స్పీకర్ ఉంటుంది. దాంతో తలుపు తీయకుండానే డోర్​ బయట ఉన్న వాళ్లతో మాట్లాడొచ్చు. ఈ బెల్​ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ గాడ్జెట్​ స్పెషాలిటీ ఏమంటే.... వైఫై కనెక్షన్​తో పనిచేస్తుంది. ఈ డోర్​బెల్​ని వైఫైతో రియల్​మి లింక్​ యాప్​లో కనెక్ట్  చేస్తే ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్​ చేయొచ్చు.  

స్మార్ట్​ టెంపరేచర్ సెన్సర్​

రూమ్​లో ఎంత వేడి ఉంది? అనేది చెప్తుంది ఇది. టెంపరేచర్​ ఒక లెవల్​కి వెళ్లినప్పుడు ఈ సెన్సర్ సాయంతో ఏసీని ఆన్​ చేయొచ్చు. ఆఫ్ చేయొచ్చు. అంతేకాదు రూమ్​ హీటర్​ లేదా ఫ్యాన్​ని ఆన్​, ఆఫ్ చేయొచ్చు.  

స్మార్ట్​ ఎయిర్​ ప్యూరిఫయర్​

ఇంట్లోని గాలిని శుభ్రం చేసేందుకు ఎయిర్​ప్యూరిఫయర్స్​ అవసరమైతాయి. రియల్​మి తీసుకొస్తున్న స్మార్ట్ ఎయిర్​ ప్యూరిఫయర్​లో పెద్ద డిస్​ప్లే ఉంటుంది. దాంతో ఎయిర్​ క్వాలిటీ తెలుసుకోవచ్చు కూడా. 

స్మార్ట్ డోర్​ సెన్సర్​

 ఇంటి లోపలి తలుపులకి వీటిని ఏర్పాటు చేయాలి. ఈ సెన్సర్​లో ప్రోగ్రాం సెట్​ చేసుకుంటే చాలు... ఇంట్లోని లైట్స్​, ఫ్యాన్​, ఇతర వస్తువుల్ని కూడా స్మార్ట్​గా ఆపరేట్​ చేయొచ్చు. 

బ్యాక్​డ్రాప్​లో వాయిస్​ మెసేజ్​​  

కొత్త ఏడాది కానుకగా యూజర్లకి కొత్త ఫీచర్లు అందించబోతోంది వాట్సాప్. త్వరలోనే బ్యాక్​గ్రౌండ్​లో వాయిస్​ మెసేజ్​లను వినేందుకు ఉపయోగపడే ఫీచర్​ తీసుకొస్తోంది. ఈ ఫీచర్​ సాయంతో ఆయా వాట్సాప్​ చాట్​లని క్లోజ్​చేసినా కూడా వాళ్లు పంపిన వాయిస్​ మెసేజ్​లని వినొచ్చు. అంతేకాదు ఈ మెసేజ్ ​ప్లే అవుతుంటే పాజ్​ చేసుకోవచ్చు కూడా.  టెస్టింగ్​ స్టేజ్​లో ఉన్న ఈ ఫీచర్​ గనుక అందుబాటులోకి వస్తే... వాయిస్​ మెసేజ్​ వింటూనే వేరేవాళ్లతో చాట్​ చేసుకోవచ్చు. అయితే, వాట్సాప్​ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆటోమెటిక్​గా వాయిస్​ మెసేజ్​ ప్లే ఆగిపోతుంది. 

వాట్సాప్​లో వ్యాక్సిన్​ సర్టిఫికెట్​

కరోనా వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకునేందుకు ‘కొవిన్’​ వెబ్​సైట్​లోకి వెళ్లాలి. అయితే, వాట్సాప్​ ఉంటే చాలు వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. వ్యాక్సిన్​​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకునే ఫీచర్​ తెచ్చింది వాట్సాప్​. అదెలాగంటే... వ్యాక్సిన్​ వేసుకున్నప్పుడు ఇచ్చిన  మొబైల్​ నెంబర్​నుంచి 9013151515 నెంబర్​ వాట్సాప్​కు ‘సర్టిఫికెట్​’ అని మెసేజ్​ పంపాలి. వెంటనే రిజిస్టర్డ్​​ మొబైల్​ నెంబర్​కి ఆరు అంకెల ఓటీపి వస్తుంది. మూడు నిమిషాల్లోపు ఈ ఓటీపి ఎంటర్​ చేయాలి. తర్వాత  ఆ ఫోన్​ నెంబర్​ మీద వ్యాక్సిన్​ వేసుకున్న వాళ్ల పేర్లు వస్తాయి. వాటిలో ఎవరి సర్టిఫికెట్​ కావాలో వాళ్ల సీరియల్​ నెంబర్​ ఎంటర్​ చేస్తే,  కొవిడ్​ వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ పీడిఎఫ్​ ఫైల్​ వస్తుంది. ట్రావెలింగ్​ చేసేవాళ్లకు  వ్యాక్సిన్​ ప్రూఫ్​​ చూపించాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్​ చాలా ఉపయోగ పడుతుంది. 

ఆండ్రాయిడ్​ 13లో  కొత్త ఫీచర్లు

స్మార్ట్​ఫోన్​తో క్యుఆర్​కోడ్​ స్కాన్​ చేసి చిటికెలో డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నారంతా. అంతేకాదు క్యుఆర్​ కోడ్ సాయంతో రెస్టారెంట్లలో ఫుడ్​ మెనూ  తెలుసుకుంటున్నారు కూడా. కొత్తగా రాబోతున్న ఆండ్రాయిడ్ 13లో క్యుఆర్​ కోడ్​ ఫీచర్​ ఉండనుంది. క్యుఆర్​కోడ్​ షేరింగ్​తో పాటు స్కానింగ్​ ఫీచర్ల​ని యూజర్లకి అందించనుంది గూగుల్​. ఈ ఫీచర్​ ఉంటే, ఫోన్​ని అన్​లాక్​ చేయకుండానే క్యుఆర్​ కోడ్​ని స్కాన్​ చేయొచ్చు. అంతేకాదు ఈ ఫీచర్​ సింబల్ నోటిఫికేషన్లలో కనిపిస్తుంది కూడా.  ఈ  ఫీచర్​ శామ్​సంగ్​ గెలాక్సీ ఫోన్లలో ఉంది. దాంతో  శామ్​సంగ్​ కంపెనీ నుంచి ఈ కొత్త అప్​డేట్​ని యూజర్లకి అందించాలనే ఆలోచనలో ఉంది గూగుల్​.