సెల్‌ఫోన్.. మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంపార్టెంట్ ఫైల్స్ నుంచి లైఫ్ టైం మెమరీస్ వరకు ఎన్నో అవసరమైన అంశాలు ఫోన్లోనే ఉంటాయి. అలాంటప్పుడు పొరపాటున ఫోన్ పోతే.. అందులో ఉన్న డేటా అంతా డేంజర్లో పడ్డట్టే. అందుకే డేటాను సేఫ్‌గా ఉంచుకోవడానికి గూగుల్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ఐడెంటిటీ చెక్ ఫీచర్. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో ఫోన్లోని డేటా సేఫ్‌గా ఉంటుంది. దీంతో మీ ఫోన్లో ఉన్న డేటా మీరు తప్ప ఎవరూ ఓపెన్ చేసే అవకాశమే ఉండదు. ఈ ఫీచర్లో కొన్ని లొకేషన్లను యాడ్ చేసుకునే వీలుంది. అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో ఫోన్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఫోన్ పిన్ వేరేవాళ్లకు తెలిసినా ఓపెన్ చేయలేరు. కాకపోతే ఈ ఫీచర్ అల్ట్రాసోనిక్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, త్రీడీ ఫేస్ రికగ్నైజేషన్ ఉన్న డివైజ్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్15 బేస్డ్ గూగుల్ పిక్సెల్ ఫోన్లో పనిచేస్తుంది.
ఎలా వాడాలంటే..
ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి, సెక్యూరిటీ & ప్రైవసీ లేదా బయోమెట్రిక్ & పాస్వర్డ్ సెలక్షన్‌పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి, ఐడెంటిటీ చెక్ ఫీచర్‌ని సెలక్ట్ చేయాలి. ఈ ఫీచర్‌ని ఆన్ చేయడానికి ముందు మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ బయోమెట్రిక్ సెట్ చేయాలి. తర్వాత లొకేషన్లను యాడ్ చేయాలి.