వీడియో గేమ్ ప్లేయర్లకు గుడ్ న్యూస్. ఇకపై ఇండియాలో ఆండ్రాయిడ్ యూజర్లు పెద్ద స్క్రీన్లపై వీడియో గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. త్వరలో గూగుల్ సంస్థ ప్లే గేమ్స్ బెటా వర్సన్ ను ఇండియాలో లాంచ్ చేయనుంది. దీంతో మీరు ఫోన్లు, టాబ్లెట్, Chromebookలతో పాటు డెస్క్ టాప్ లలో కూడా మీకు ఇష్టమైన వీడియో గేమ్ లను ఆడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే అందుబాటులోకి రానుంది. భవిష్యత్ లో మరిన్ని భాషల్లో ఈ గేమ్స్ అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ కంపెనీ తెలిపింది.
ఈ గూగుల్ ప్లేగేమ్స్ బెటా వర్షన్ ద్వారా మీ కంప్యూటర్ లో ఈజీగా బ్రౌజ్ చేయొచ్చు. డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ గేమ్స్ అన్నీ కంప్యూటర్ బిగ్ స్క్రీన్ పై ఆడుకోవచ్చు. అంతేకాదు మౌజ్, కీబోర్డు ఉపయోగించి కంట్రోల్ చేయడం ద్వారా గేమ్స్ ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫీచర్‌లో ఉత్తమమైన అంశం ఏమిటంటే..మీరు మీ Google ఖాతాతో ఈ పరికరాల్లో దేనికైనా సైన్ ఇన్ చేయవచ్చు .
గూగుల్ ప్లే గేమ్స్ బెటా వర్సన్ కు అవసరమైన కంప్యూటర్ కన్ ఫిగరేషన్
విండోస్ 10 ఆపైన వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. 10 జిబి ఎస్ఎస్ డి స్టోరేజ్, Intel UHD Graphics 630 or similar గ్రాఫిక్స్ , 8జిబి ర్యామ్ కలిగిన కంప్యూటర్ లలో గూగుల్ ప్లే గేమ్స్ బెటా వర్సన్ ద్వారా వీడియో గేమ్స్ డౌన్ లోడ్ చేసుకొని వీడియో గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు.