సీసీఐతో కేసును సెటిల్‌‌మెంట్‌‌ చేసుకున్న గూగుల్‌‌

సీసీఐతో కేసును సెటిల్‌‌మెంట్‌‌ చేసుకున్న గూగుల్‌‌

న్యూఢిల్లీ:  కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తో నెలకొన్న కేసును గూగుల్ సెటిల్ చేసుకుంది.  ఆండ్రాయిడ్ టీవీ విభాగంలో అన్యాయమైన వ్యాపార పద్ధతులను గూగుల్ పాటిస్తోందని నాలుగేళ్ల క్రితం సీసీఐ ఫిర్యాదులు అందుకుంది. వీటిపై విచారణ మొదలు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా గుగూల్‌‌ రూ. 20.24 కోట్లను సెటిల్‌‌మెంట్ అమౌంట్‌‌ కింద చెల్లించింది. 

 కాంపిటీషన్ చట్టంలో సెటిల్‌‌మెంట్, కమిట్‌‌మెంట్ నిబంధనలను  2023లో ప్రవేశపెట్టారు. ఈ ప్రొవిజన్ల కింద సెటిల్‌‌ అయిన మొదటి కేసు ఇదే.  గూగుల్‌‌పై  2021లో సీసీఐ విచార ప్రారంభించింది.  తాజా సెటిల్‌‌మెంట్ కింద గూగుల్ భారతదేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్‌‌‌‌, ప్లే సర్వీసెస్‌‌లకు వేరువేరుగా  లైసెన్స్ అందిస్తుంది.  తద్వారా ఈ సేవలను బండిల్ చేయడం లేదా డిఫాల్ట్‌‌గా ఇవ్వడం ఉండదు.