IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్

ఐపీఎల్ 2025 లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ ఎవరనే ప్రశ్నకు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ సమాధానమిచ్చాడు. తమ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు.. ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ పిల్ సాల్ట్ 2025 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనింగ్ చేస్తాడని ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఈ సందర్భంగా తమ ప్రణాళికలను పంచుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొత్త మార్పులు ఉంటాయని అండీ ఫ్లవర్ అన్నాడు. 

ప్రస్తుతం తమకు ఉన్న జట్టుతో చాలా సంతోషంగా ఉన్నామని, ఫిల్ సాల్ట్ వంటి పవర్ హిట్టర్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం చాలా ముఖ్యం అని ఫ్లవర్ చెప్పాడు. వీరిద్దరి భాగస్వామ్యమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని.. లియామ్ లివింగ్‌స్టోన్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ జట్టులో ఉండడంతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉందని తెలిపాడు. బౌలింగ్ లైనప్‌లో భువనేశ్వర్ కుమార్ తో కలిసి జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిక్ సలామ్ సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. 

ALSO READ : Virat Kohli: బతిమిలాడి మరీ కోహ్లీకి నా జట్టులో ఛాన్స్ ఇస్తా: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీతో పాటు యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్, బౌలర్ యశ్ దయాల్‎ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు, రజత్ పాటిదార్‎కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‎కు రూ.5 కోట్లు చెల్లించింది. ఈ ముగ్గురి కోసం ఆర్సీబీ తమ పర్స్‎లోని రూ.37 కోట్లు కేటాయించింది.

ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:

జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్)
ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్)
జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్)
భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్)
లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
రసిఖ్ సలామ్.. రూ.6. కోట్లు (బౌలర్)
కృనాల్ పాండ్యా.. రూ.5.75 కోట్లు (ఆల్ రౌండర్)
టిమ్ డేవిడ్.. రూ.3 కోట్లు (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)
సుయాష్ శర్మ.. రూ.2.60 కోట్లు (బౌలర్)
జాకబ్ బెథెల్.. రూ.2.60 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
దేవదత్ పడిక్కల్.. రూ.2 కోట్లు (బ్యాటర్)    
నువాన్ తుషార.. రూ.1.60 కోట్లు (శ్రీలంక, బౌలర్)
రొమారియో షెపర్డ్.. రూ.1.50 కోట్లు (వెస్టిండీస్, ఆల్ రౌండర్)
స్వప్నిల్ సింగ్.. రూ.50 లక్షలు (ఆల్ రౌండర్)
స్వస్తిక్ చికారా.. రూ.30 లక్షలు (బ్యాటర్)    
మనోజ్ భాండాగే.. రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)
మోహిత్ రతీ.. రూ.30 లక్షలు (బౌలర్)
అభినందన్ సింగ్.. రూ.30 లక్షలు (బౌలర్)
లుంగి ఎంగిడి.. రూ.1 కోటి (దక్షిణాఫ్రికా, బౌలర్)

ఆర్సీబీ రిటైన్ లిస్ట్:

విరాట్ కోహ్లీ.. రూ.21 కోట్లు (బ్యాటర్)
రజత్ పాటిదార్.. రూ.11 కోట్లు (బ్యాటర్)
యశ్ దయాల్.. రూ.5 కోట్లు (బౌలర్)