వాషింగ్టన్: న్యూజెర్సీ సెనేటర్‌గా కొరియన్ అమెరికన్ ఆండీ కిమ్ గెలుపొందాడు. చట్టసభకు ఎన్నికైన తొలి ఆసియన్ అమెరికన్‌గా ఆండీ కిమ్ రికార్డు సృష్టించారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆండీకి.. 20.29 లక్షల ఓట్లు పోలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ప్రముఖ వ్యాపారవేత్త కర్టిస్ బాషాకు 17.03 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ ‘‘కొరియన్ అమెరికన్లు పడుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గతంలో ఎన్నో పోరాటాలు చేశాను. అదే కొనసాగిస్తా. నా విజయం ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచింది’’ అని కిమ్ తెలిపాడు.