బ్రిటన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్.. మాజీ ప్రపంచ నంబర్ వన్.. మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత అండీ ముర్రే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పారిస్ ఒలింపిక్స్ తన కెరీర్ లో చివరిదని చెప్పుకొచ్చిన ఈ బ్రిటన్ స్టార్.. డబుల్స్ లో రోలాండ్ గారోస్‌లో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయారు. అమెరికా జోడీ టేలర్ ఫ్రిట్జ్, టామీ పాల్ 6-2, 6-4 బ్రిటన్ జోడీ అండీ ముర్రే,డాన్ ఎవాన్స్ చేతిలో ఓడిపోవడంతో ముర్రే టెన్నిస్ శకం ముగిసింది.
ముర్రే తొలిసారిగా 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్ గేమ్స్ ఆడాడు. ఈ ఒలింపిక్స్ లో ముర్రే తొలి రౌండ్ లోనే యెన్-హ్సున్‌తో ఓడిపోయి ఇంటిదారి పట్టాడు. 2012 లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో ముర్రే ఏకంగా స్వర్ణం గెలుచుకున్నాడు. ఫైనల్లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను వరుస సెట్లలో ఓడించడం విశేషం. 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ లోనూ ముర్రే స్వర్ణం గెలిచాడు. దీంతో మెన్స్ విభాగంలో ఒలింపిక్స్‌లో రెండుసార్లు స్వర్ణం గెలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్ గా నిలిచాడు.
ముర్రే టెన్నిస్ కెరీర్ విషయానికి వస్తే 2005 లో ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి అడుగుపెట్టాడు. 19 సంవత్సరాల తన టెన్నిస్ కెరీర్ లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. వీటిలో రెండు వింబుల్డన్, ఒక యూఎస్ ఓపెన్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలనే కల తీరలేదు. మొత్తం 739 మ్యాచ్ ల్లో గెలిచిన ముర్రే.. 262 మ్యాచ్ ల్లో ఓడిపోయాడు. 2016 లో తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ కు చేరుకున్నాడు.
For the memories and the victories.
— Wimbledon (@Wimbledon) August 1, 2024
The brilliance and resilience.
The motivation and inspiration.
Thank you for everything, Andy 🥹 pic.twitter.com/mUl7iOfeio