
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ ను టీమిండియా కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ అంతటా అద్భుతంగా రాణించిన రోహిత్ సేన ఫైనల్లో కూడా అంచనాలను అందుకుంటూ మూడోసారి ఈ టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్ విజయంపై టోర్నీలో పాల్గొన్న ఇతర జట్లు సంతృప్తికరంగా లేవు. ఎందుకంటే దుబాయ్ లోనే ఇండియా మ్యాచ్ లు ఆడడం కలిసొచ్చిందని.. వారికి అది హోమ్ గ్రౌండ్ కింద మారిపోయిందని ఇతర జట్లు తమ నిరాశను వ్యక్తం చేశాయి.
వాస్తవానికి బీసీసీఐ, భారత ప్రభుత్వం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పాకిస్థాన్ పంపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ, బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌ను నిర్ణయించాయి. సెమీ ఫైనల్ ఫైనల్ మ్యాచ్ తో సహా అన్ని మ్యాచ్ లను దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే నిర్వహించారు. టోర్నీ సాగుతున్న కొద్దీ చాలా వివాదాలకు దారి తీసింది. ఇతర దేశాలకు దుబాయ్ నుంచి పాకిస్థాన్ కు ప్రయాణించడం కష్టంగా అనిపించింది. సెమీ ఫైనల్ సమయంలోసౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టోర్నీ షెడ్యూల్ పై తమ అసహనాన్ని చూపించాయి. తాజాగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ అండీ రాబర్ట్ ఐసీసీ భారత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
రాబర్ట్స్ బహిరంగంగానే ఐసీసీపై మండిపడ్డాడు. భారత్ కు ఐసీసీ అండగా నిలుస్తుందని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడటంపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాత్రను కూడా ఆయన ప్రశ్నించారు. ఇండియాకు ఐసీసీ నో చెప్పడం నేర్చుకోవాలని ఆయన కోరారు.
ALSO READ | Champions Trophy 2025: ప్రైజ్ మనీ వివరాలు వెల్లడి.. ఏ జట్టు ఎంత గెలుచుకుందంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఎక్కడకు ప్రయాణించలేదు. ఇది భారత జట్టుకు బాగా కలిసి వచ్చింది. ఇది క్రికెట్ కాదు. ఇది అన్యాయం. మీరు అన్ని దేశాలకు సమాన స్థాయిలో షెడ్యూల్ ఉండేలా సిద్ధం చేయాలి. క్రికెట్ లో ఇండియా బాగా డబ్బు సంపాదిస్తుందని తెలుసు. కానీ క్రికెట్ ఒక దేశ క్రీడ కాదు. ఐసీసీ భారత క్రికెట్ బోర్డుకు అండగా నిలుస్తుంది. టీమిండియా నో-బాల్స్, వైడ్లను నిషేధించాలనుకుంటే ఐసీసీ అలానే చేస్తుంది."అని రాబర్ట్స్ మిడ్-డేతో చెప్పారు.
Former West Indies cricketer Andy Roberts fires shots at BCCI & ICC with a bold statement.
— CricTracker (@Cricketracker) March 12, 2025
📸: ICC pic.twitter.com/beeXDlaezC