విద్యార్థుల్లో రక్తహీనత .. బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ

విద్యార్థుల్లో రక్తహీనత .. బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ
  • ఆందోళన కలిగిస్తున్న కంటి సమస్యలు
  • జాగ్రత్తలు సూచిస్తున్న వైద్య సిబ్బంది

మెదక్, వెలుగు: స్కూల్​ విద్యార్థుల్లో రక్తహీనత, కంటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎనీమియా ముక్త్​ భారత్ (ఏఎంబీ)లో భాగంగా రాష్ట్రీయ బాల స్వస్థ టీంల ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్ స్టూడెంట్స్ కు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా100 గ్రాముల రక్తంలో12 శాతం హిమోగ్లోబిన్ ఉండాలి. పరీక్షల్లో చాలా మంది విద్యార్థుల్లో హెచ్ బీ తక్కువగా ఉన్నట్టు నిర్దారణ అవుతోంది. రక్త హీనత విద్యార్థుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. 

.రక్తహీతన ఉన్నవారిలో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటున్నారు. అలాగే స్కూళ్లలో విద్యార్థులకు కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా మంది చూపు మందగించడం, తదితర సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించారు. రక్తహీనత ఉన్న వారికి చికిత్స అందిస్తుండగా, కంటి చూపు మందగించిన వారికి సమస్య పెరగకుండా జాగ్రత్తలు సూచిస్తుండడంతోపాటు అవసరమైన వారికి కంటి అద్దాలను అందించనున్నారు. 

గర్ల్స్​లో ఎక్కువ రక్త హీనత

ఎనీమియా ముక్త్​ భారత్​ ఫేజ్​1 లో జిల్లాలోని 192 స్కూల్స్​, 12 కాలేజ్​లలో 32,300 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15,060 మంది బాయ్స్​, 17,240 మంది గర్ల్స్​ ఉన్నారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 523 మంది విద్యార్థుల్లో సివియర్​ ఎనీమియా సమస్య ఉన్నట్టు తేలింది. వారిలో 108 బాయ్స్​ ఉండగా, 415 మంది గర్ల్స్​ ఉన్నారు. 12,685 మంది విద్యార్థుల్లో మాడరేట్​ ఎనీమియా ఉంది. వారిలో 4,908 మంది బాయ్స్​ ఉండగా, 7,777 మంది గర్ల్స్​ఉన్నారు. 5,872 మందికి మైల్డ్​ ఎనీమియా సమస్య ఉంది. వారిలో 2,775 మంది బాయ్స్​, 3,097 మంది గర్ల్స్​ ఉన్నారు. ఎనీమియాతో బాధపడుతున్న విద్యార్థుల్లో 13,220 మందికి సింగిల్​ డోస్​, 18,557 మందికి టూ డోస్​ 
మెడిసిన్​ ఇచ్చారు.  

ఏఎంబీ ఫేజ్ 2లో..

జిల్లాలో 899 స్కూల్స్​లో 28,091 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. వారిలో 12,352 మంది బాయ్స్, 15,739 మంది గర్ల్స్​ఉన్నారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 284 మంది విద్యార్థుల్లో సివియర్​ ఎనీమియా సమస్య ఉన్నట్టు నిర్ధారణ అయింది. వారిలో 80 మంది బాయ్స్​ఉండగా, 204 మంది గర్ల్స్​ఉన్నారు. అలాగే 8,319 మంది విద్యార్థులకు మాడరేట్​ ఎనిమియా సమస్య ఉంది. వారిలో 3,301 మంది బాయ్స్​ ఉండగా, 5,018 మంది గర్ల్స్​ఉన్నారు. వీరుపోను 6,408 మందిలో మైల్డ్​ఎనిమియా ఉంది. వారిలో 2,724 మంది బాయ్స్​ ఉండగా, 3,684 మంది గర్ల్స్​ఉన్నారు. తీవ్ర ఎనీమియాతో బాధపడుతున్న విద్యార్థుల్లో 220 మందికి ట్రీట్​మెంట్​ అందించగా, 64 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. 

కంటి సమస్యలు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 912 స్కూల్స్​లో ఫస్ట్, సెకండ్​​ఫేజ్ లలో  కలిపి ఐదు టీంలతో 64,933 మంది విద్యార్థులకు ఐ స్క్రీనింగ్​ నిర్వహించారు.  వారిలో 3,293 మందిలో వివిధ రకాల కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. చూపు బాగా మసకబారిన వారికి కింటి అద్దాలు అందించనున్నారు.