పోలీసులు అంగన్వాడీల మధ్య తోపులాట.. మహిళా ఎస్సైని తోసేసిన్రు

అంగన్ వాడీల ఆదిలాబాద్ కలెక్టర్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. CITU, AITUC నాయకులతో కలిసి కలెక్టరేట్ మట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. 

అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఓ మహిళా ఎస్సైని తోసేశారు. దీంతో మహిళ ఎస్సై స్వల్ప అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారు అంగన్వాడీలు. అరెస్ట్ లతో ఉద్యమాలను అణిచివేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని అగ్రహాం వ్యక్తం చేశారు. 

ALSO READ :స్కూల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు : పిల్లలను కాపాడి ప్రాణాలు విడిచాడు

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు అంగన్వాడీలు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు.  

బారీకేడ్లు దాటుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట జరింది. అంగన్వాడీలను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు.