అంగన్​వాడీ సెంటర్ల గుడ్లపై స్టాంప్ !

మహాముత్తారం, వెలుగు : అంగన్​వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న గుడ్లు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం ఆఫీసర్లు వినూత్న పద్ధతి అవలంభిస్తున్నారు. గుడ్లపై స్టాం పులు వేస్తూ సెంటర్లకు చేరవేస్తున్నారు. ఐసీడీఎస్ ​జోన్లలో రెడ్, బ్లూ కలర్లలో ​రౌండ్​ స్టాంప్​వేసి పంపిస్తున్నారు.