
హుజూర్‌నగర్, వెలుగు : అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, చిన్నారులకు అందాల్సిన గుడ్లు ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో కనిపించాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ – మఠంపల్లి బైపాస్ రోడ్డులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు ఆదివారం ఓ కస్టమర్ వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాడు. అక్కడ ఉన్న కోడిగుడ్లపై అంగన్‌వాడీ సెంటర్ స్టాంప్ కనిపించడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానిని నిలదీశాడు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ ఆఫీసర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను, ఎగ్స్ సరఫరా చేసే ఫౌల్ట్రీ ఫారాన్ని తనిఖీ చేసి ఎంక్వైరీ చేపట్టారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానికి నోటీసు అందజేసి, ఎంక్వైరీ రిపోర్ట్‌ను జిల్లా ఆఫీసర్లకు పంపినట్లు సీడీపీవో హేమాదేవి చెప్పారు.