పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలి

పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలి

మెదక్​ టౌన్, వెలుగు: అంగన్ వాడీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని  సోమవారం కలెక్టర్ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్​ఏవోకు, ఐసీడీఎస్ జిల్లా డైరెక్టర్ బ్రహ్మాజీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి నర్సమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్ మాట్లాడుతూ.. అంగన్​వాడీ ఉద్యోగులకు డిసెంబర్, జనవరి నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. 

రాష్ట్రంలో అన్ని జిల్లాల వారికి వేతనాలు చెల్లించి మెదక్ జిల్లాకు చెల్లించకపోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో అంగన్​వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, జిల్లా నాయకులు మంజుల, సంతోష, ఫరీద, జయ, సుజాత, ప్రమీల, స్వప్న, లక్ష్మి పాల్గొన్నారు.