
అశ్వారావుపేట, వెలుగు : మండలంలోని ఊట్లపల్లి అంగన్వాడీ టీచర్, ఆయాల మధ్య జరిగిన గొడవ కారణంగా 10 రోజులుగా అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేయకపోవడంపై పీడీ వేల్పుల విజేత ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె కేంద్రాన్ని తనిఖీ చేశారు. పది రోజులుగా లబ్ధిదారులకు పౌష్టికాహారం కూడా అందలేదని తేలింది. ఈ విషయమై సీడీపీవో, సూపర్వైజర్, టీచర్ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.