అంగన్​వాడీ టీచర్ కు ఫిట్స్.. ఆసుపత్రికి తరలింపు..

రోజురోజుకు అంగన్​వాడీ టీచర్లు, వర్కర్ల ఆందోళన ఉధృతమవుతోంది. తమను పర్మినెంట్​ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ వారు సమ్మె చేస్తున్నారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో అంగన్వాడీ టీచర్ కు  ఫిట్స్ వచ్చింది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్​ఎదుట  ధర్నా చేస్తున్న అంగన్​వాడీలు ఒక్కసారిగా కలెక్టరేట్​లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు గేట్లు మూసేశారు. దీంతో అంగన్​వాడీలు గేట్లును బలంగా లాగి గేట్లను ఓపెన్​ చేశారు.  కలెక్టరేట్​లోపల  కొంత సేపు ఆందోళన చేపట్టారు.

ALSO READ : వరల్డ్ కప్ కి టీమిండియా జెర్సీ అదరహో ..ఆకట్టుకుంటున్న థీమ్ సాంగ్

మరోవైపు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని సమగ్ర శిశు అభివృద్ధి కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేసి, వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు. ధర్నా చేపట్టి ఇన్ని రోజులు అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.