వెంకటాపురం మండలంలో అంగన్​వాడీ టీచర్ల ధర్నా

 వెంకటాపురం మండలంలో అంగన్​వాడీ టీచర్ల ధర్నా

వెంకటాపురం, వెలుగు:  ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఐసీడీఎస్ సీడీపీవో వ్యక్తిగత దూషనలు చేస్తున్నారని, తోటి సిబ్బంది కేంద్రాలకు, కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి లేనిపోని మాటలు చెబుతున్నారంటూ అంగన్​వాడీ టీచర్లు ధర్నాకు దిగారు. శనివారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద  బైఠాయించి నిరసన తెలిపారు.

టీచర్లు మాట్లాడుతూ వెంకటాపురం సీడీపీవో ధనలక్ష్మి అంగన్​వాడీ కేంద్రాల వద్దకు వచ్చి గ్రామస్తులు, పిల్లలు, ఆయాల సమక్షంలో అసభ్యకరమైన పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఆమె ప్రవర్తన వల్ల కుటుంబాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ట్రాన్స్​ఫర్ చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం ములుగు కలెక్టర్ దివాకరకు కంప్లీట్ చేశారు. కార్యక్రమంలో వెంకటాపురం ప్రాజెక్ట్ మండలాల నుంచి సుమారు 60 మంది అంగన్​వాడీ టీచర్లు పాల్గొన్నారు.