సంగారెడ్డి  కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా

సంగారెడ్డి  కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా

మెదక్​టౌన్, వెలుగు: -ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని,  మొబైల్ అంగన్​వాడీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని అంగన్​వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 48 గంటల ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అన్నపూర్ణ, నర్సమ్మ,  మల్లేశం మాట్లాడుతూ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలతో పీఎం శ్రీ పథకం కింద ఫ్రీ ప్రైమరీ ఎలిమెంటరీ కేంద్రాలను 28 జిల్లాల్లో,  56  కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఐసీడీఎస్​ను నిర్వీర్యం చేయడంలో భాగమేనన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంతోష్, అంగన్​వాడీ నాయకులు రాజ్యలక్ష్మి, స్వప్న, విజయ, ఇందిర, లక్ష్మీ పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్,  వెలుగు:  ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగుల కనీస వేతనం రూ. 26,000 పెంచుతూ చర్చ జరగాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు.  సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట నిర్వహించే 48  గంటల ధర్నాను ప్రారంభించారు.  24  రోజుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.  

గతంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వేతనం పెంచడంతో పాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.  ధర్నాలో సీఐటీయూ నాయకులు యాదగిరి మైపాల్, నాగేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శశికళ, మంగ, ఏసుమని, మంజుల, ఇందిరా, జానకి, రజిత, విజయలక్ష్మి తో పాటు  అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.