జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దీక్ష శిబిరం వద్ద నలుగురు అంగన్వాడీ వర్కర్లు కళ్లు తిరిగి పడిపోయారు. ఎమ్మార్వో ఆఫీస్ ముందు గత కొన్ని రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో అంగన్వాడీ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా నలుగురు అంగన్వాడీ వర్కర్లకు వైరల్ ఫీవర్ వచ్చినా కూడా నిరసన దీక్షలో హాజరయ్యారు. ధర్నా చేస్తున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోయారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read :- ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల కల సాకారం చేసిన సీఎం కేసీఆర్
అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేవారు. ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులరైజ్ చేయాలని.. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.