
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సిద్దిపేటలో అంగన్వాడీ వర్కర్లు నిరసన బాట పట్టారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని కల్పించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లను బంద్ చేసి ధర్నాలు చేపడుతుంటే.. తాళాలు పగలగొట్టి పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ద్వారా సెంటర్లను నడుపుతున్నారని మండిపడ్డారు.
ALSO READ :హౌరా ఎక్స్ ప్రెస్ లో పొగలు : వరంగల్ దగ్గర నిలిపివేత
తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే తమను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను రెగ్యులరైజ్ చేసి, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు.