నవీపేట్, వెలుగు: చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ ఉద్యోగులను నవీపేట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ చేసి, స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. డిమాండ్ల పరిష్కారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తుండగా అరెస్ట్చేయడం సరికాదన్నారు. డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.