కరీంనగర్ టౌన్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు ఆదివారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు రోడ్డుపై ధర్నా చేసిన అనంతరం ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్‌వాడీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈటైంలో లేడీ పోలీసులు లేకపోగా మగ పోలీసులే తమను నెట్టేశారంటూ అంగన్‌వాడీలు ఆరోపించారు. అనంతరం ఏసీపీ నరేశ్ వినతిపత్రం తీసుకుని వారిని అక్కడి నుంచి పంపించారు.
కండ్లకు గంతలు కట్టుకొని నిరసన
జగిత్యాల రూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ ముందు అంగన్‌వాడీలు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. వీరికి బీజేపీ కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోడం బాధాకరమన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా కన్వీనర్రాజలింగం సంఘీభావం తెలిపారు.