
చెవిలో పువ్వు పెట్టుకొని అంగన్వాడీ వర్కార్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు ఏడవ రోజు నిరవధిక సమ్మె చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే తమను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను రెగ్యులరైజ్ చేసి, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో రకమైన నిరసనతో సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.
- ALSO READ | మాకూ దళిత బంధు ఇవ్వండి.. మిన్నంటిన ఆందోళనలు